తెలుగు మానిఫెస్టో

ఇరుసు వికీ నుండి
Jump to navigation Jump to search

స్వప్నం

తెలుగువారందరూ తమ రోజువారీ వ్యవహారాలన్నింటినీ తెలుగులోనే జరుపుకోగలగాలి!

సగటు తెలుగువాడికి కావల్సిన వినోదం, విజ్ఞానం, వికాసం అన్నీ తెలుగులో లభ్యమవాలి.
తెలుగు రాష్ట్రాలలో విద్యా బోధన, పరిపాలన, వ్యాపార వ్యవహారాలూ తెలుగులో జరగాలి.
తెలుగు మాత్రమే వచ్చినవారు కూడా సౌకర్యంగా బతకడానికి తగ్గ సంపాదనావకాశాలు ఉండాలి.

కార్యాచరణ

మన ఈ స్వప్నాన్ని నిజం చేసుకొనుటకు ఈ కార్యక్రమాలతో మొదలుపెడుదాము:


  • చర్చావేదికలు
  • ఈ కార్యక్రమాల గురించి చర్చించుటకు మరియు నిర్వహించుటకు మనము ఈ వేదికలను వాడుకుంటున్నాము.
    • ట్విట్టర్: @telugudandu
    • ఫేస్‌బుక్: <త్వరలో>
    • గూగుల్ సమూహాలు: <త్వరలో>


  • తెలుగు మాటల కాయింపు

  • తెలుగు పుస్తకాలు
  • నలభైనాలుగు వేలకు పైబడి ఉన్న మన పుస్తకాల జాబితాను తెలుగులో చేసి అందుబాటులో తేవడం. ఈ జాబితాలోని నకలు హక్కులు తీరిపోయి జాతీయమైన పుస్తకాలను ఓసీఆర్ వాడి యూనికోడీకరించడం.

  • తెలుగు నిఘంటువులు
  • ఇవి అత్యంత అవసరం. నిఘంటువులు రూపొందించడమే గాక అన్ని రకాలుగా (అంతర్జాలంలో, పుస్తకాలుగా, దృశ్యక శ్రవ్యకాలుగా) అందుబాటులోకి తేవాలి.
    • సాంకేతిక పదకోశాలు
    • పారిభాషిక పదకోశాలు
    • మాండలిక పదకోశాలు
    • యాస పదకోశాలు
    • బూతుల పదకోశాలు


  • తెలుగులో కంప్యూటర్లు, మొబైళ్ళు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు
    • స్థానికీకరణ
    • తెలుగు పనిముట్లు


  • తెలుగు జాల సూచిక
  • జాలములో ఉన్న అనేక తెలుగు గూడులను విషయాలవారిగా ఒకచోట క్రోడీకరించుట.

  • ప్రపంచ తెలుగు మహాసభలు

  • మాతృభాషా దినోత్సవం

  • తెలుగు ఉద్యోగాలు

  • ప్రభుత్వ పోకడ
  • తెలుగుకు సంబంధించి ప్రభుత్వ విధానాలను గమనించుట, అవి భాషావ్యాప్తికి ఉపయోగకరంగా ఉండునట్లు వత్తిడి తెచ్చుట, సంబంధిత నిధులను సరిగా వినియోగించునట్లు చూచుట.