వీడియోలకు తెలుగు ఉపశీర్షికలు

ఇరుసు వికీ నుండి
Veeven (చర్చ | రచనలు) (→‎ఎలా?) చేసిన 07:24, 13 జూన్ 2016 నాటి కూర్పు
(తేడాలు) ← పాత కూర్పు | ప్రస్తుత కూర్పు (తేడాలు) | తరువాతి కూర్పు → (తేడాలు)
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

ఏమిటి?

ఆకాంక్ష: వీడియోలు తెలుగు ఉపశీర్షికలతో (subtitles) ఉండాలి.

ఎందుకు?

  1. వినికిడి సమస్యలు ఉన్నవారు సినిమాలను, వీడియోలను ఆనందించవచ్చు.
  2. శబ్దం వినిపించ(కూడ)ని సందర్భాలలో (రద్దీ ప్రదేశాలు లేదా నిశ్శబ్దంగా ఉండాల్సిన ఆసుపత్రులు, గ్రంథాలయాలు వంటి చోట్ల) నడిచే వీడియోలకు మాటలు లేని లోటుని ఉపశీర్షికలతో పూరించవచ్చు.
  3. పరభాషా వీడియోలను తెలుగు వారు తెలుగు ఉపశీర్షికల ద్వారా అర్థం చేసుకోవచ్చు.

ఎలా?

  1. వీడియోలను ట్రాన్స్‌స్క్రైబ్ చేసి, వాటిని వివిధ భాషల లోనికి అనువదించే సౌలభ్యాన్ని కొన్ని జాల గూళ్ళు అందిస్తున్నాయి.
  2. వికీమీడియా కామన్స్ లోని వీడియోలకు ఉపశీర్షికలను చేర్చే సదుపాయం ఉంది. చూడండి Timed Text.
  3. కోర్సెరా వారి కోర్సుల అనువాదం
  4. ఖాన్ అకాడమీ వారి వీడియోల అనువాదం
  5. జాల గూళ్ళ యజమానులు వారు అందిండే వీడియోలకు, ఆడియోలకు ఉపశీర్షికలను అందించడానికి HTML5లో Web Video Text Tracks అనే సౌలభ్యం ఉంది.
  6. యాంత్రిక ఉపశీర్షికలు: తెలుగు వాచ్యాన్ని పాఠ్యంగా మార్చగలిగే (speech to text) సౌలభ్యం పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందితే దాన్ని మీడియా ప్లేయర్లకు అనుసంధానించి అప్పటికప్పుడు ఉపశీర్షికలను చూపించవచ్చు. ఇది సూదూర స్వప్నం.

సంబంధీకులు - వారి బాధ్యతలు

  • బధిరులకు సేవలను అందించే సంస్థలు
  • ఔత్సాహికులు