లిపి/వ్యాకరణ సంస్కరణ

ఇరుసు వికీ నుండి
Jump to navigation Jump to search

తెలుగులిపి చాలా వరకూ తాళపత్రాలపై త్వరగా వ్రాసేందుకు అనువుగా రూపుదిద్దుకుంది. అందరిలో బాగా జీర్ణించుకుపోయిన అంశం. ఇది మారాలంటే క్షేత్ర స్థాయిలో ప్రక్షాళన జరగాలి. అరవంలో ఇలా రెండు పర్యాయాలు జరిగింది. మొదట అరవంలో లేని వర్ణాలన్నీ (శ, విసర్గం, క-ఖ లకు 1,2 ద్వారా తేడా మొ॥) స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో భాషా నిపుణుల ద్వారా చేర్చబడ్డాయి, ఇవి జీర్ణించుకునేందుకు దాదాపు మూడు తరాలు పట్టింది, వెంటనే అన్నా దురై నుండి వచ్చిన సంస్కృత-హిందీ వ్యతిరేక ఉద్యమం వలన ఇవి మళ్ళీ లుప్తాక్షరాలుగా చెయ్యాలి అనీ, అంతకు ముందు వాడిన వర్ణాలనే వాడాలనే నిర్ణయం జరిగింది. ఇప్పటికీ ఈ అంశం వారిలో చాలా అయోమయాన్ని నింపుతుంది. అంతర్జాలమే అన్నీ అని నమ్ముతున్న నేటి తరానికి ఇది అవరోధం కాదు. తెలుగులిపి కష్టతరం అనుకునే వారు పూర్తి రోమన్ లిప్యంతరీకరణ వాడుతున్న రోజులివి. ఈమాట లాంటి జాలస్థలాలు RTS లో చదివే విధానాన్ని అదనంగా ఇస్తున్నాయి. లిపి పరంగా సంస్కరణలు తేవాల్సిన అగత్యం అయితే లేదు. ఇక వ్యాకరణ పరంగా ఏ విధమైన సంస్కరణలు రావాలని చూస్తున్నదీ వ్యాఖ్య రచయిత తెలుపలేదు. - రహ్మానుద్దీన్