ఫిబ్రవరి-21

ఇరుసు వికీ నుండి
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
  • తోటి తెలుగు వారితో తెలుగులోనే మాట్లాడదాం. ఈ-వేగుల్లో, ట్విట్టరు కూతల్లో, ఫేస్‌బుక్ టపాల్లో, వాట్స్‌‍ఆప్ కబుర్లలో కూడా తెలుగే రాద్దాం. వీటిలో మన పేర్లూ తెలుగులో పెట్టుకుందాం. #మనభాషమనబాధ్యత #ఫిబ్రవరి21 #మనమాతృభాషతెలుగు #అంతర్జాతీయమాతృభాషాదినోత్సవం


  • మనకి సేవ చేయాల్సిన ప్రజాప్రతినిధులనూ, ప్రభుత్వాధికారులనూ, వ్యాపార సంస్థలనూ, స్వచ్ఛంద సేవా సంస్థలనూ మనతో తెలుగులోనే వ్యవహారాలను జరపమని కోరదాం. #మనభాషమనబాధ్యత #ఫిబ్రవరి21 #మనమాతృభాషతెలుగు #అంతర్జాతీయమాతృభాషాదినోత్సవం


  • తెలుగు రాష్ట్రాల్లో అమ్మే వస్తూత్పత్తుల పేర్లూ, వాటిని వాడుకునే సూచనలూ, తీసుకోవాల్సిన జాగ్రత్తలూ, వాటి తయారీలో వాడిన పదార్థాల వివరాలూ తెలుగులో కూడా ఉండాలని కోరదాం. #మనభాషమనబాధ్యత #ఫిబ్రవరి21 #మనమాతృభాషతెలుగు #అంతర్జాతీయమాతృభాషాదినోత్సవం


  • కంప్యూటరీకరణ పేరుజెప్పి ఆంగ్లంలోకి మారిపోయిన ప్రభుత్వాల, సంస్థల కార్యకలాపాలు ఇక తెలుగు బాట పట్టాలి. ఈ రోజుల్లో కంప్యూటర్లలో, మొబైళ్ళలో తెలుగుకి సంబంధించిన సాంకేతిక అడ్డంకులు ఏమీ లేవు. #మనభాషమనబాధ్యత #ఫిబ్రవరి21 #మనమాతృభాషతెలుగు #అంతర్జాతీయమాతృభాషాదినోత్సవం


  • గవన్నీ మాకు తెల్వద్! మా తెలుగు మాగ్గావాలె!! #మనభాషమనహక్కు #మనభాషమనబాధ్యత #మనమాతృభాషతెలుగు #ఫిబ్రవరి21 #అంతర్జాతీయమాతృభాషాదినోత్సవం
"https://wiki.irusu.in/index.php?title=ఫిబ్రవరి-21&oldid=261" నుండి వెలికితీశారు