"తెలుగు రచనా శైలిపై ప్రామాణిక పుస్తకం కావాలి" యొక్క కూర్పుల మధ్య తేడాలు

ఇరుసు వికీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
('తెలుగు రచనా శైలిపై ప్రామాణిక పుస్తకం కావాల...' తో కొత్త పేజీని సృష్టించారు)
(తేడా లేదు)

08:55, 31 డిసెంబరు 2017 నాటి కూర్పు

తెలుగు రచనా శైలిపై ప్రామాణిక పుస్తకం కావాలి

“ఇంగ్లీషు మాటల వాడుకకు ఏడు నియమాలు, రచనకి ఉపయోగపడే పదకొండు సూత్రాలు, రచన రూపం నిర్దేశించే కొన్ని వివరాలు, రాసేటప్పుడు చాలామంది చేసే కొన్ని దుష్ప్రయోగాలు – ఇవి, [ ది ఎలిమెంట్స్ ఆఫ్ స్టైల్ ] పుస్తకంలో కూర్చబడ్డాయి. […] ఇప్పటి వరకూ మనకి [తెలుగు] వాడుకభాష వ్యాకరణంపై పుస్తకం లేదు. వాక్యంలో ఎప్పుడు, ఎక్కడ ఏ విరామచిహ్నాలు పెట్టాలో సూచించే పుస్తకం లేదు. అంతే కాదు, వాడుకభాషలో రాసినప్పుడు వాక్యనిర్మాణం ఎట్లా ఉండాలో నేర్పే పుస్తకం లేదు. […] పాఠకుడిని దృష్టిలో పెట్టుకొని రచనలని మెరుగు పరిచే కొన్ని సూత్రాలు తెలుగు రచనలకి కూడా ఉపయోగ పడతాయి. ‘ది ఎలిమెంట్స్ ఆఫ్ స్టైల్’ వంటి పుస్తకం తెలుగులో తయారు చేసుకోవలసిన అవసరం ఉన్నదని నేను నమ్ముతున్నాను.”

— ఒక తెలుగు పుస్తకం కావాలి [1], వేలూరి వేంకటేశ్వర రావు