తెలుగు రచనా శైలిపై ప్రామాణిక పుస్తకం కావాలి

ఇరుసు వికీ నుండి
చిలాబు (చర్చ | రచనలు) ('తెలుగు రచనా శైలిపై ప్రామాణిక పుస్తకం కావాల...' తో కొత్త పేజీని సృష్టించారు) చేసిన 09:55, 31 డిసెంబరు 2017 నాటి కూర్పు
Jump to navigation Jump to search

తెలుగు రచనా శైలిపై ప్రామాణిక పుస్తకం కావాలి

“ఇంగ్లీషు మాటల వాడుకకు ఏడు నియమాలు, రచనకి ఉపయోగపడే పదకొండు సూత్రాలు, రచన రూపం నిర్దేశించే కొన్ని వివరాలు, రాసేటప్పుడు చాలామంది చేసే కొన్ని దుష్ప్రయోగాలు – ఇవి, [ ది ఎలిమెంట్స్ ఆఫ్ స్టైల్ ] పుస్తకంలో కూర్చబడ్డాయి. […] ఇప్పటి వరకూ మనకి [తెలుగు] వాడుకభాష వ్యాకరణంపై పుస్తకం లేదు. వాక్యంలో ఎప్పుడు, ఎక్కడ ఏ విరామచిహ్నాలు పెట్టాలో సూచించే పుస్తకం లేదు. అంతే కాదు, వాడుకభాషలో రాసినప్పుడు వాక్యనిర్మాణం ఎట్లా ఉండాలో నేర్పే పుస్తకం లేదు. […] పాఠకుడిని దృష్టిలో పెట్టుకొని రచనలని మెరుగు పరిచే కొన్ని సూత్రాలు తెలుగు రచనలకి కూడా ఉపయోగ పడతాయి. ‘ది ఎలిమెంట్స్ ఆఫ్ స్టైల్’ వంటి పుస్తకం తెలుగులో తయారు చేసుకోవలసిన అవసరం ఉన్నదని నేను నమ్ముతున్నాను.”

— ఒక తెలుగు పుస్తకం కావాలి [1], వేలూరి వేంకటేశ్వర రావు