తెలుగు మానిఫెస్టో

ఇరుసు వికీ నుండి
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

ఆశయం

తెలుగుభాషకు ఆధునిక హోదా తెద్దాం!

చూ.: [1]

స్వప్నం

తెలుగువారందరూ తమ రోజువారీ వ్యవహారాలన్నింటినీ తెలుగులోనే జరుపుకోగలగాలి!

తెలుగువారికి మాతృభాషలోనే విద్యాబోధన జరగాలి.
తెలుగు రాష్ట్రాలలో పరిపాలన, వ్యాపార వ్యవహారాలూ తెలుగులో జరగాలి.
సగటు తెలుగువాడికి కావలసిన వినోదం, విజ్ఞానం, వికాసం అన్నీ తెలుగులో లభ్యమవాలి.
తెలుగు మాత్రమే వచ్చినవారు కూడా సౌకర్యంగా, గౌరవంగా బతకడానికి తగ్గ సంపాదనావకాశాలు ఉండాలి.

కార్యాచరణ

మన ఈ స్వప్నాన్ని సాకారం చేసుకొనుటకు ఈ కార్యక్రమాలు దోహదం చేస్తాయి. వీటిలో కొన్ని ఇప్పటికే మొదలుపెట్టబడ్డాయి.


  • 0. చర్చావేదికలు
  • ఈ కార్యక్రమాల గురించి చర్చించుటకు మరియు నిర్వహించుటకు మనము ఈ అధికారిక వేదికలను వాడుకుంటున్నాము:


  • 1. తెలుగు మాటల కాయింపు
  • మన తెలుగును రక్షించుకోవడంతో పాటు, మారుతున్న అవసరాలకు అనుగుణంగా కొత్తపదాల సృజన కూడా జరగాలి. (దీనికొరకు తెలుగుపదం [telugupadam.org] జాలగూడుని వాడుతున్నాము)
  • 2. తెలుగు నిఘంటువులు
  • నిఘంటువులు రూపొందించడమే గాక అన్ని రకాలుగా (అంతర్జాలంలో, పుస్తకాలుగా, దృశ్యక శ్రవ్యకాలుగా) అందుబాటులోకి తేవడం. ఇవి అత్యంత అవసరం. ఇవి భాషను నేర్చుకోవడానికే గాక, భాషపై పట్టును సంపాదించడానికి కూడా ఉపయోగపడతాయి.
    • సాంకేతిక పదకోశాలు
    • పారిభాషిక పదకోశాలు
    • మాండలిక పదకోశాలు
    • యాస పదకోశాలు
    • బూతుల పదకోశాలు


  • 3. తెలుగులోకి అనువాదాలు
    • సాహిత్య అనువాదాలు
    • తెలుగు వికిపీడియా
    • తెలుగు విక్షనరీ
    • తెలుగులో సాఫ్ట్‌వేర్
    • గూగుల్ పటాలు


  • 4. తెలుగులో కంప్యూటర్లు, మొబైళ్ళు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు
    • స్థానికీకరణ
    • తెలుగు పనిముట్లు


  • 5. తెలుగు పుస్తకాలు
  • నలభైనాలుగు వేలకు పైబడి ఉన్న మనసు ఫౌండేషన్ పుస్తకాల జాబితాను తెలుగులో చేసి అందుబాటులో తేవడం. ఈ జాబితాలోని నకలు హక్కులు తీరిపోయి జాతీయమైన పుస్తకాలను ఓసీఆర్ వాడి యూనికోడీకరించడం.

  • 6. తెలుగు జాల సూచిక
  • జాలములో ఉన్న ఉపయోగకరమైన తెలుగు గూడులను విషయాలవారిగా ఒకచోట క్రోడీకరించడం. దీనివలన త్వరగా ఏ సమాచారం ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు.

  • 7. ప్రపంచ తెలుగు మహాసభలు
  • తెలుగు రాష్ట్రాలలో మరియు ఇతర ప్రదేశాలలో జరుగు ప్రతి ప్రపంచ తెలుగు మహాసభలలో భాషాభిమానులు దిశానిర్దేశం చేసుకోవడం.

  • 8. మాతృభాషా దినోత్సవం

  • 9. తెలుగు వైజ్ఞానిక సంస్థ
  • పాశ్చాత్య దేశాలలో ఒక విజ్ఞానానికి సంబంధించిన వాళ్లందరికి తమ తమ విశ్వవిద్యాలయాలతో, కళాశాలలతో సంబంధం లేకుండా ఒక వైజ్ఞానిక సంస్థ ఉంటుంది. ఇలాంటి సంస్థ ఒకటి తెలుగు పరిశోధన కోసం వేరేగా ఏర్పాటుచేయడం. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లోను, తెలంగాణాలోను, భారతదేశంలోని ఇతర ప్రాంతాలలోను తెలుగు చెప్పే ఉద్యోగాలు చేస్తున్నవాళ్లు అందరూ సభ్యులుగా చేరడం. వాళ్లు కట్టే సభ్యత్వ రుసుముతో ఈ సంస్థ చేయాల్సిన రెండు ముఖ్యమైన పనులు:
    • తెలుగు వైజ్ఞానిక సదస్సు
    • సంవత్సరానికొకసారి తెలుగు వైజ్ఞానిక సదస్సును నిర్వహించడం. ఈ సదస్సుల్లో వివిధ విద్యాసంస్థల్లో తెలుగు చెప్పేవాళ్లు తాము చేసే పరిశోధనల మీద ప్రామాణికమైన పత్రాలు సమర్పించడం.
    • ప్రామాణిక పరిశోధన సంచిక
    • సంవత్సరానికి మూడు లేదా నాలుగు సార్లు వెలువడే ప్రామాణిక పరిశోధన సంచిక నడపడం. ఆ పత్రికలో ప్రచురణార్ధం వచ్చే వ్యాసాల్ని సమర్ధులు చదివి, అవసరమైతే దానిలో సవరణలు సూచించి అది ప్రచురణార్హమని చెప్పిన తరువాతే ప్రచురించడం.


  • 10. తెలుగు ఉద్యోగాలు
  • తెలుగు వచ్చిన వారికి గల ఉద్యోగ అవకాశాల గురించి విస్తృతంగా తెలియజేయడం. ప్రభుత్వ ఉద్యోగాల్లో తెలుగుకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం. ప్రభుత్వేతర ఉద్యోగాల్లో కూడా ఇదే విధానాన్ని అనుసరించేలా మిత్రుల ద్వారా, భాషాభిమానుల ద్వారా, భావసారూప్యత గల వారి ద్వారా ఒక కొత్త ఒరవడిని సృష్టించడం.

  • 11. ప్రభుత్వ పోకడ
  • తెలుగుకు సంబంధించి ప్రభుత్వ విధానాలను గమనించడం, అవి భాషావ్యాప్తికి ఉపయోగకరంగా ఉండునట్లు చూడడం, సంబంధిత నిధులను సరైన పనులకు వినియోగించునట్లు చూడడం. ప్రభుత్వ కార్యకలాపాలు, ప్రభుత్వ ఆదేశాలు, న్యాయస్థానాల కార్యకలాపాలు మరియు తీర్పులు తెలుగులో ఉండేలా చూడడం.