"తెలుగు నేర్పడానికి వనరులు" కూర్పుల మధ్య తేడాలు

ఇరుసు వికీ నుండి
Jump to navigation Jump to search
(' === ఎందుకు, ఎలా? === <blockquote>మనం తెలుగు నేర్చుకోలేదు...' తో కొత్త పేజీని సృష్టించారు)
 
 
పంక్తి 15: పంక్తి 15:
 
—  [http://eemaata.com/em/issues/201309/2335.html?allinonepage=1 తెలుగు ప్రపంచభాష ఎప్పుడవుతుంది?, వెల్చేరు నారాయణరావు - ఈమాట]
 
—  [http://eemaata.com/em/issues/201309/2335.html?allinonepage=1 తెలుగు ప్రపంచభాష ఎప్పుడవుతుంది?, వెల్చేరు నారాయణరావు - ఈమాట]
 
</blockquote>
 
</blockquote>
 +
 +
== వనరులు ==
 +
* [[పాఠ్య పుస్తకాలు|తెలుగు పాఠ్య పుస్తకాలు]]
  
  
 
[[వర్గం:ఆలోచనలు]]
 
[[వర్గం:ఆలోచనలు]]

05:01, 7 సెప్టెంబరు 2015 నాటి చిట్టచివరి కూర్పు

ఎందుకు, ఎలా?

మనం తెలుగు నేర్చుకోలేదు. మనకి తెలుగు వచ్చింది. ఏది మీరు నేర్చుకున్నారో, అది మీరు చెప్పగలరు. సంగీతం నేర్చుకుంటే, సంగీతం చెప్పగలరు. నాట్యం నేర్చుకుంటే, నాట్యం నేర్పగలరు. […] కానీ, తెలుగు మనం నేర్చుకోలేదు. ఏరకంగా తెలుగు మన మనస్సుల్లోకి ప్రవేశించిందో ఏరకంగా తెలుగు మన శరీరంలో భాగమైపోయిందో మనం చెప్పలేం. అంచేత తెలుగు పుట్టుకతో రానివాళ్లకి తెలుగు ఎలా చెప్పాలో మనకి తెలియదు.

[…]

తెలుగు మొదటి భాష కాని వాళ్ల కోసం వ్యాకరణాలు, భాషా బోధన విధానాలూ తయారు చెయ్యవలసిన అవసరం మనకి ఇంత వరకూ కలగలేదు. అంతే కాదు, ఆ బోధన విధానాలు ఇంగ్లీషు మాతృభాష అయిన వాళ్లకీ, ఇంకొక భారతీయ భాష మాతృభాష అయిన వాళ్లకీ వేరువేరుగా తయారు చెయ్యాలి అనే దృష్టి కాని, పిల్లలకి ఒకరకం గానూ, పెద్దవాళ్ళకి మరొక రకంగానూ, పుస్తకాలు తయారు చేయాలనే ఆలోచన కూడా మనకు కలగలేదు.

[…]

ఒక భాషని రెండో భాషగా నేర్పడానికి ప్రత్యేకమైన శిక్షణ కావాలి. ఆ రకమైన శిక్షణ పొందడానికి ఉత్సాహవంతులైన తెలుగు వాళ్ళు ప్రయత్నం చేయాలి. వాళ్ళు స్కూళ్ళలో, కాలేజీలలో విశ్వవిద్యాలయాల్లో తెలుగు నేర్పే రోజు వొస్తే అమెరికాలో తెలుగు నిలబడుతుంది. ఆపైన ఇంకా విశ్వవిద్యాలయాలతో మనం కలిసి పనిచేస్తే, తెలుగుకి ప్రొఫెసరు స్థాయిలో యూనివర్సిటీలలో ఉద్యోగాలు నెలకొల్పగలిగితే, అప్పుడు వాళ్ళ కృషి ఫలితంగా తెలుగు ప్రపంచ భాష అవుతుంది.

ప్రపంచ స్థాయిలో తెలుగు గురించి తెలుసుకునే వాళ్ళు, తెలుగు లో వున్న సాహిత్యాన్నీ, ఇతర వైజ్ఞానిక సమాచారాన్నీ అంది పుచ్చుకునే వాళ్లు ప్రపంచవ్యాప్తంగా వుంటారు. మన పిల్లలు ఏ స్కూల్లో చేరినా, ఏ విశ్వవిద్యాలయంలో చేరినా తెలుగు చదువుకునే వసతులు ఏర్పడతాయి. మన పిల్లలే కాదు ఇతర పిల్లలు కూడ తెలుగు నేర్చుకుంటారు.

తెలుగు ప్రపంచభాష ఎప్పుడవుతుంది?, వెల్చేరు నారాయణరావు - ఈమాట

వనరులు