వాడుకరి:రహ్మానుద్దీన్

ఇరుసు వికీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

నా పేరు రహ్మానుద్దీన్ షేక్.
నా ఆసక్తులు :

  1. తెలుగు సంగణన
  2. స్వేచ్ఛా బహిరంగ సాఫ్టువేర్లు
  3. స్వేచ్ఛా జాలం
  4. తెలుగు స్థానికీకరణ
  5. తెలుగు భాషా, సంస్కృతి, సాహిత్యం

ఇరుసు లో చేయాల్సినవి

1. తెలుగు వారం -> సామాజిక అనుసంధాన జాలగూళ్ళలో ఓ వారం పాటూ తెలుగులో ప్రవర పేరును ఉంచడం.
2. తెలుగు భాష వార్తా విశేషాల వెబ్సైటు.
3. తెలుగు కియాస్క్.
4. తెలుగు పాటల మెటాడేటా తెలుగులో (కాపీ రైటు ఐపోయినవి అధికారికంగా, కాపీరైటులో ఉన్నవి అనధికారికంగా; సంగీత ముద్రణ కంపెనీలను ఈ దిశగా పని చేసేలా చేయడం).
5. తెలుగు పేరు పలకలు -> ఫ్లికర్ లాంటి ఫుటో జాలగూళ్ళలో తెలుగు అక్షరాలున్న ఫుటోలను గుర్తించటం (ట్యాగింగ్, రీపోస్టింగ్ - తగిన నకలు హక్కులతో).
6. తెలుగు చేవ్రాతల చిత్రాల సమాహారం (గోడరాతలు, చిత్రకారుల రాతలు, వినూత్న అంగడి పేర్ల రాసిన తీరు, సినిమా శీర్షికలు)
7. తెలుగు ఫాంట్లలో దోషాలను తెలిపే, సేకరించే వెబ్సైటు
8. స్టాక్ ఎక్స్‍చేంజ్ లో తెలుగుకు ఓ వెబ్సైటు/ కోరా తరహా వెబ్సైటు (ఎందుకు.కాం ను వాడవచ్చా?) ఇదివరకి స్టాక్ ఎక్స్‍చేంజ్ వద్ద వచ్చినవి.
9. ప్రతి ఊరికో పేజీ ఉండే వెబ్సైటు (http://www.onefivenine.com స్టాటిక్ గా కొంత సమాచారంతో ఉంది) - ఊరి విషయాలు ఎవరయినా చేర్చవచ్చు, చిత్రమాలికలతో సహా
10. తెలుగు చిత్రమాలిక (తెలుగుతో సంబంధమున్న ఏ చిత్రమయినా!)