వస్తువుల పేర్లు తెలుగులో ఉండాలి

ఇరుసు వికీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

తెలుగు రాష్ట్రాల్లో అమ్ముడయ్యే వస్తూత్పత్తుల పేర్లూ, వాటిని వాడేందుకు సూచనలూ (ఆహార పదార్థాలూ మందులూ అయితే వాటిలో వాడిన వదార్ధాలూ, ఆరోగ్యపరమైన హెచ్చరికలూ, జాగ్రత్తలూ) ఇవన్నీ తెలుగులో కూడా ఉండాలి. దీనివల్ల తెలుగుకి ఉద్యోగాలు దొరుకుతాయి. మనమేం చేయవచ్చంటే, వ్యాపార సంస్థలను అడగాలి. ఒక్కరిద్దరు అడిగితే సరిపోదు; ఒకట్రెండుసార్లు అడిగినా సరిపోదు. అందరూ అడగాలి. అన్ని వేదికల మీదా అడగాలి. అవకాశమున్న చోటల్లా అడగాలి. తెలుగుకి మార్కెట్ ఉందని తెలిసేలా అడగాలి