భాషా ప్రజాస్వామికత

ఇరుసు వికీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

భాషా ప్రజాస్వామికత అంటే ఒక భాషా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు, సామాజిక వర్గాలు, వృత్తులు, ఆర్థిక వర్గాల వారి పదజాలానికి, భాషను ఆధారం చేసుకునే భావజాలానికి, నుడికారానికి, జాతీయాలకు, జీవన సంబంధమైన విశేషాలకు కూడా సాధారణ వ్యవహరణాభాషలో అవకాశం, గౌరవం ఉండడం. అవకాశం, గౌరవం అన్నది ప్రభుత్వ పరిపాలనా కార్యకలాపాల్లో, విద్యాబోధనలో, మీడియాలో కన్పించాలి. ఈ వేర్వేరు పదజాలాలు వగైరాలతో పాటు సాహిత్య సంస్కృతుల రూపంలోనూ ఆ అభివృద్ధికి కృషి జరుగుతూపోవాలి. — టంకశాల అశోక్ (నమస్తే తెలంగాణ సంపాదకీయం)