తెలుగుకి బిట్‌మ్యాప్ ఖతులు

ఇరుసు వికీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
దస్త్రం:Dotmatrixani.gif
డాట్‌మాట్రిక్స్ డిస్‌ప్లే

ఆకాంక్ష: డాట్‌మాట్రిక్స్ డిస్‌ప్లేలలో తెలుగుని చూపించడానికి వీలుగా తెలుగు బిట్‌మ్యాప్ ఖతులు అందుబాటులో ఉండాలి.

ఎందుకు

ఈ క్రింది చోట్ల తెలుగుని చూపించడానికి బిట్‌మ్యాప్ ఖతులు తప్పనిసరి.

  • బస్సులలో రైళ్ళలో గమ్యస్థానాన్ని సూచించే బోర్డులూ, బస్టాండ్లలో రైల్వే స్టేషన్లలో విమానాశ్రయాలలో రాకపోకలను సూచించే బోర్డులు ఇప్పుడు ఎలక్ట్రానిక్ డిస్‌ప్లేలుగా మారిపోయాయి.
  • కార్లలో డాష్‌బోర్డు మీదు ఉండే డిస్‌ప్లే: ఆడియో ప్లేయర్లు, ఎఫ్ఎమ్ రేడియో, ఇతరత్రా సౌలభ్యాలు వాటి స్థితిని చూపిస్తాయి.
  • వాషింగ్ మెషీన్లు, ఫ్రిజ్, ఏసీ, ఏసీ రీమోట్ వంటి వాటి చిన్న తెరలు.
  • కరెంటు బిల్లు, సూపర్ మార్కెట్లలో ఇచ్చే రసీదులు, మెషీన్ల ద్వారా ఇచ్చే బస్సు, రైలు టికెట్లు వంటి వాటికి.

ఎలా

  • అనేక రకాల డాట్‌మాట్రిక్స్ డిస్‌ప్లేలకు తగ్గట్టుగా వివిధ శైలులలో తెలుగు బిట్‌మ్యాప్ ఖతులను రూపొందించాలి.
  • వివిధ కంపెనీలను ఆయా డిస్‌ప్లేలలో తెలుగుని చూపించమని కోరాలి.

లంకెలు