తెలుగు మెటాడేటాతో తెలుగు పాటలు

ఇరుసు వికీ నుండి
Jump to navigation Jump to search

సంగీతాన్ని వినిపించే అన్ని అనువర్తనాలూ ఆయా పాట(ల) వివరాలను తెరపై ప్రదర్శిస్తాయి. పాట మొదటి పాదం, సంగీత దర్శకుడి పేరు, పాడినవారి పేరు, సినిమా (లేదా ఆల్బమ్) వంటి వివరాలు. నేడు దాదాపు అన్ని సంగీత అనువర్తనాలూ ఈ వివరాలను తెలుగులో కూడా చూపించగలుగుతున్నాయి. అయితే, తెలుగు పాటలకు ఈ వివరాలు తెలుగులో ఉండటం లేదు. తెలుగు పాటలను అందించే వాణిజ్య జాల సేవలు కూడా ఈ విషయంలో ఏమీ చెయ్యడం లేదు. ఔత్సాహికులు కొందరు ప్రత్యేక శ్రద్ధతో వారి పాటల సేకరణలకు తెలుగు మెటాడేటా పూరించి ఆనందిస్తున్నారు.

ఆకాంక్ష

సీడీ రూపంలో కానీ, జాల సంగీత దుకాణాల్లో డిజిటల్ రూపంలో కానీ తెలుగు పాటలను కొంటే లేదా జాల సేవల ద్వారా వింటే అవి తెలుగు మెటాడేటాతో ఉండాలి. వివిధ రకాల ప్లేయర్లలో వాటిని వినేప్పుడు ఆ పాటల వివరాలు తెలుగులో కనబడాలి.

ఇబ్బందులు

  • కార్లలో ఉంటే ప్లేయర్లు సాధారణంగా లెడ్ ఆధారిత (అక్షరానికి 7/9/14/16 సెగ్మెంట్లు లేదా డాట్‌మాట్రిక్స్) డిస్‌ప్లే లతో ఉంటాయి. వీటిల్లో తెలుగు అక్షరాలు కనబడకపోయే ఇబ్బంది ఉంది. కానీ పెద్ద తెర ఉండే స్మార్ట్ డిస్‌ప్లేలు అందుబాటు లోనికి వస్తే ఈ పరిస్థితి మారిపోతూంది. (ఉన్నత శ్రేణి కార్లలో ఇప్పటికే లభిస్తున్నాయి.)

→ డాట్‌మాట్రిక్స్ డిస్‌ప్లేలలో చూపించడానికి వీలుగా బిట్‌మ్యాప్ తెలుగు ఖతులను అందుబాటు లోనికి తీసుకురావాలి.

సంబంధీకులు - వారి బాధ్యతలు

సంగీత పరిశ్రమ (సంగీత దర్శకులు, ఆడియో కంపెనీలు, సంగీతాన్ని అందించే జాలగూళ్ళు)

  • విడుదలయ్యే ప్రతీ తెలుగు ఆల్బమూ తెలుగు మెటాడేటాతో ఉండేట్టు చూడాలి.
  • ఇప్పటికే జాల దుకాణాల ద్వారా లేదా జాల సేవల ద్వారా పంపిణీ చేస్తూన్న పాటలకు తెలుగులో మెటాడేటా చేర్చాలి.

(ఇది తెలుగు ఉద్యోగావకాశం కూడా!)

పాత పాటలను సేకరించి పంపిణీచేసే ఔత్సాహికులు

కొందరు ఔత్సాహికులు కాపీహక్కులకు కాలంచెల్లిన అమూల్యమైన పాత పాటలను సేకరించి వివిధ జాలగూళ్ళలో అందుబాటులోనికి తెస్తున్నారు.

  • పాటల మెటాడేటాను తెలుగులో ఉండేలా చూడడం.

కార్యచరణ క్రమం

  1. పాటల మెటాడేటా తెలుగులో కూడా ఉండొచ్చు, ఉంటే ఆడియో ప్లేయర్లు కూడా చూపిస్తాయి అని తెలుగు ప్రజలకు, సినిమా/సంగీత పరిశ్రమకు, పాటల సేకర్తలకు అవగాహన కల్గించాలి.
  2. కాపీహక్కుల ఇబ్బంది లేని పాటలను తెలుగు మెటాడేటాతో అందుబాటులో ఉంచవచ్చు.

లంకెలు